నాలుగు జిల్లాల్లో భానుడి భగభగలు.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు!

by Seetharam |
నాలుగు జిల్లాల్లో భానుడి భగభగలు.. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు!
X

దిశ,వెబ్‌డెస్క్: సింగరేణిలో ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగాయి. నాలుగు జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఆధిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కార్మికులు తల్లడిల్లుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల దగ్గర ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో 45 డిగ్రీలు దాటుతున్నాయి. విపరీతమైన ఎండలకు తోడు వడగాలులతో కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వాతావారణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆకాశం మేఘాలతో నిండుకుంది. అయితే హైదరాబాద్‌లో 38 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు చేసుకునే అవకాశం ఉంది.ఏపీలో మాత్రం వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈధురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల కరెంటు స్థంభాలు సైతం విరిగి కింద పడ్డాయి. పలు ప్రాంతాల్లో కరెంట్ పోవడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కరెంట్ లైన్లు పునరుద్ధరణ జరగక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కరెంట్ లేక పోవడంతో పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి సేవలకు ఆటంకం కలుగుతోంది.

Advertisement

Next Story