పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు

by Shiva |   ( Updated:2023-03-24 04:42:11.0  )
పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు
X

దిశ, వెబ్ డెస్క్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలురాసే వారందరికీ ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. ఎలాంటి బస్ పాస్ లేకపోయినా హాల్ టిక్కెట్ చూపించి తమ పరీక్ష కేంద్రానికి చేరుకునే వీలు కల్పించింది. అలాగే పరీక్ష కేంద్రం నుంచి తమ ఇంటికి కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం తెలంగాణ ఆర్టీసీ అధికారులు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కల్పించారు. వచ్చే నెల 3 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇలాంటి సౌకర్యాన్ని కల్పించిన టీఎస్ ఆర్టీసీ పదో తరగతి విద్యార్థులకు కూడా కల్పించాలని నిర్ణయించింది. వచ్చే నెల 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ సౌకర్యాన్ని విద్యార్థులకు కల్పించింది.

ఇవి కూడా చదవండి: TS: పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

Advertisement

Next Story