మరోచోట వీధి కుక్కల బీభత్సం.. బాసర MPP భర్తపై దాడి

by GSrikanth |
మరోచోట వీధి కుక్కల బీభత్సం.. బాసర MPP భర్తపై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. బాసర మండలం బిద్రేల్లి గ్రామంలో ఎంపీపీ సునీత భర్త, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ విశ్వనాథ్ పటేల్‌పై కుక్క దాడి చేసింది. విశ్వనాథ్ తన ఫ్రెండ్స్‌తో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చిన కుక్క నిర్దాక్షిణ్యంగా కరిచేసింది. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న వ్యక్తి కుక్కను తరిమేయడంతో విశ్వనాథ్‌‌కు ప్రమాదం తప్పింది.

కుక్క కాటుతో విశ్వనాథ్ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో, ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా, గత ఐదు రోజుల వ్యవధిలో మూడు ఘటనలు వెలుగుచూశాయి. బాసరలో మేక పిల్లలు చంపిన కుక్కలు రెండ్రోజుల క్రితం ట్రిపుల్ ఐటీలో ఇద్దరు విద్యార్థులపై దాడి చేశాయి. కుక్క దాడితో మండల బాసర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story