రిటైర్మెంట్ తరువాత లంబోర్ఘిని కారు కొన్న వృద్ధుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?

by Shiva |
రిటైర్మెంట్ తరువాత లంబోర్ఘిని కారు కొన్న వృద్ధుడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : రిటైర్మెంట్ తరువాత ఓ వృద్ధుడికి విలాసవంతమైన లంబోర్ఘిని కారును కొనుగోలు చేయాలనే కోరిక ఉండేది. అయితే, అనుకున్నట్లుగానే కారు కొనుగోలు చేసి తన కోరికను పరిపూర్ణం చేసుకున్నాడు. కారు డెలివెరీ సమయంలో షోరూం వెళ్లిన ఆ వృద్ధుడు బూడిద రంగు లంబోర్ఘిని కారులో కూర్చొని ఆస్వాదించాడు. కారులో కూర్చున్నప్పుడు బాగానే కూర్చున్నా.. దిగేందుకు మాత్రం నానా కష్టాలు పడ్డాడు. చివరికి పెద్దగా నవ్వుతూ.. ఆ వృద్ధుడు తన మోకాళ్లపై కారులోంచి కిందకు దిగుతూ పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫిగెన్ అనే మహిళ తన 'X' ఖాతాలో 'రిటైర్మెంట్ తర్వాత మీరు లాంబోను కొనుగోలు చేస్తే పరిస్థితి ఇలా ఉంటుంది' అంటు వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story