హుజారాబాద్ లో ఆర్టీసీ అధికారుల ఔదార్యం

by Sridhar Babu |
హుజారాబాద్ లో ఆర్టీసీ అధికారుల ఔదార్యం
X

దిశ, హుజురాబాద్: ఓ ప్రయాణికుడు బస్సులో మరచిపోయిన బ్యాగును అతనికి అప్పగించి ఔదర్యాన్ని చాటుకున్నారు ఆర్టీసీ అధికారులు. వివరాల్లోకి వెలితే… వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన దాసరి రాఘవయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి మంగళవారం జమ్మికుంటలోని తన కూతురు వద్దకు వెళ్లాడు. బుధవారం ఉదయం మినీ ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యాడు. హుజురాబాద్ చేరుకున్నాక ఆ బస్సు దిగి హన్మకొండ బస్సులో ఎల్కతుర్తికి బయలుదేరాడు. మార్గమధ్యలో తనవద్ద బ్యాగు లేకపోవడంతో తిరిగి వచ్చి జమ్మికుంట 11వ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఏడుస్తు కూర్చున్నాడు. అతన్ని గమనించిన బస్టాండ్ కంట్రోలర్ సుధాకర్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే అతను జమ్మికుంట వైపు వెళ్లే బస్సులను పరిశీలించి.. ఆ మినీ బస్సు డ్రైవర్ వెంకటయ్యను ఆరా తీశారు. దీంతో ఆ బస్సులోనే బ్యాగ్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బ్యాగు ఉన్న విషయం రాఘవయ్యకు తెలిపారు. ఆర్టీసీ అధికారులు బ్యాగును బాధితునికి తిరిగి అప్పగించారు. బ్యాగులో రూ. 21 వేలతో పాటు చిట్ ఫండ్ రశీదులు కూడా అలాగే ఉండడంతో రాఘవయ్య ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed