- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దు:ఖాన్ని ఆపుకోలేకపోతున్నా: అమితాబ్
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి సోషల్ మీడియాలో మరోసారి తీవ్రంగా చర్చ జరుగుతోంది. విషయమేమిటంటే.. అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్, ఆయన మనవరాలు ఆరాధ్య కరోనా నుంచి కోలుకుని హాస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి సోమవారం ఇంటికి చేరుకున్నారు. అయితే, తన కోడలు, మనవరాలికి కరోనా నెగెటివ్ గా వచ్చిందని, దీంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని తెలియడంతో అతను భావోద్వేగానికి గురయ్యారంట. ఈ విషయం తెలిసి ఆయన కళ్లలో నీళ్లు ఆగలేదంట. ఈ విషయాన్ని అమితాబ్ ట్వట్టర్ ద్వారా పంచుకున్నారు.
‘ఆరాధ్య, ఐశ్వర్య కోరనా నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలిసి నేను దుఖాన్ని ఆపుకోలేకపోయాను. అయితే.. నా మనవరాలు నన్ను ఆలింగనం చేసుకుని ఏడువొద్దు తాతయ్య.. మీరు త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జవుతారు అని నాకు ధైర్యాన్ని నూరి పోసింది. నా మనవరాలి నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నాను’ అమితాబ్ అందులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అమితాబ్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.