- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెత్తనం మొత్తం ఆయనదే
దిశా కోదాడ: సాక్షాత్తు రాష్ట్ర మునిసిపాలిటీ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పలు సందర్భాలల్లో భార్యల పదవుల్లో ఉంటే భర్తల పెత్తనం చెల్లదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికినీ భర్తల పెత్తనాలు కోనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ మునిసిపాలిటీలో మహిళా కౌన్సిలర్ ఉన్న ఓ వార్డులో ఆమె భర్త పెత్తనం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆయన ఆగడాలను తట్టుకోలేక కొందరు వ్యక్తులు ఉన్నతాధికారులను ఆశ్రయించినప్పటికినీ అతనిలో మార్పు లేదు.. పైగా వారిపై దాడులకు పాల్పడుతున్నాడు. ఆ వార్డు పరిధిలోని ఓ వ్యాపారి కొత్తగా ఇల్లు నిర్మిస్తుండగా అడ్డుకున్నాడు. నా అనుమతి లేకుండా.. నన్ను సెటిల్ చేయకుండా ఇల్లు ఎలా కడతావ్ అంటూ, తనకు అడిగినంత డబ్బులు చెల్లించాలని.. లేనిపక్షంలో కట్టిన ఇంటిని మున్సిపాలిటీ వారితో కూల్చివేయిస్తానని బెదిరించాడు. దీంతో ఇంటి యజమాని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ భర్త మరోసారి బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు తనను కాపాడాలంటూ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, పోలీసులను ఆశ్రయించి విన్నవించుకున్నాడు.