- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఘటన అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నది!
బెల్గాం : కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ ఘటన అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నది.! విషయమేమిటంటే.. బెల్గాంలోని ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బెల్గాంకు చెందిన సదాశివ్ హిరట్టి (55) బుధవారం రాత్రి ఇంట్లో మృతిచెందాడు. అయితే ఆ సమయంలో అతడి భార్య, కొడుకు, కుమార్తె ఇంట్లో లేరు. మృతుడి భార్య కొడుకు, కుమార్తె ఇంటికి వచ్చిన అనంతరం తలుపు కొట్టగా సదాశివ్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో వారు తలుపులు పగులగొట్టి చూడగా సదాశివ్ కుర్చీపై చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో లబోదిబోమంటూ ఏడ్చారు. సదాశివ్ మృతివార్త తెలిసినా కూడా బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడి రాలేదు. కనీసం అంత్యక్రియలకు కూడా సాయం చేయలేదు. దీంతో తన కుమారులతో కలిసి తన భర్త మృతదేహాన్ని గుడ్డలో చుట్టి తోపుడు బండిపై పెట్టి కుమారుల సాయంతో స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, బంధువులు సాయం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త కరోనాతో చనిపోయాడని భావించి ఏ ఒక్కరు మృతదేహం వద్దకు రాలేదని, తన వద్ద డబ్బు కూడా లేకపోవడంతో చేసేది లేక తోపుడు బండిపై తీసుకెళ్లి తన మృతదేహానికి అంత్యక్రియలు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.