- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అరుణాచల్ ప్రదేశ్ డాక్టర్ గొప్పతనం.. వీడియో వైరల్
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: అక్కడ ఫుల్ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. విధులు నిర్వహించేందుకు అవకాశం అస్సలే లేదు. ఒకవేళ ఆ సాహసం చేసినా తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామో లేదో తెలియని పరిస్థితి. ఇలా అన్ని కోణాల్లో ఇబ్బందులు ఎదురైనా ఓ వైద్యుడు తన విధి నిర్వహణను మరిచిపోలేదు. వాగు దాటుకుంటూ వెళ్లి కరోనా టెస్టులు చేశాడు. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాంపురా జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న సిమంతో బోరా అనే డాక్టర్.. కరోనా కాంటాక్టులను గుర్తించేందుకు భారీ వరదల్లోనే సాహసం చేశాడు. తరసో అనే గ్రామాన్ని చేరుకునేందుకు వరద నీటికి ఎదురెళ్లారు. కరోనా టెస్టులు చేసేందుకు వర్షాలు, వరదలను లెక్క చేయకుండా ముందుకుసాగాడు. ఇప్పుడా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Advertisement
Next Story