- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
50వేలకు చేరువగా కరోనా కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరువవుతోంది. నగరంతో పాటు జిల్లాల్లోనూ ఇటీవలికాలంలో మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. మూడు రోజులు నుంచి ఈ పెరుగుదల కొనసాగుతూ ఉంది. గడచిన 24గంటల వ్యవధిలో 15,882 టెస్టులు చేస్తే అందులో 1,554 పాజటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 49,259కు చేరింది. తొమ్మిది మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 438కి చేరుకుంది. టెస్టుల సంఖ్య పెరగడంతో రోజువారీ నమోదయ్యే పాజిటివిటీ రేటు తగ్గుతున్నా మొత్తంగా చూస్తే చాలా రాష్ట్రాలకంటే తెలంగాణలో ఎక్కువగానే ఉంది. సగటున 16 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2.93 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ప్రజారోగ్య విభాగం వెల్లడించింది.
హైదరాబాద్‌లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయ్
దాదాపు వారం, పది రోజుల పాటు హైదరాబాద్ నగరంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. బుధవారం వెల్లడించిన బులిటెన్ వివరాల ప్రకారం, మొత్తం 1,554 కేసుల్లో సగానికంటే ఎక్కువ (842) నగరంలోనే నమోదయ్యాయి. పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 96 చొప్పున నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాలూ దాదాపుగా నగరంలో కలిసిపోయి ఉంటాయి. వీటిని కూడా కలుపుకుంటే నగరంలో కేసుల సంఖ్య 1,070 అవుతుంది.
నిన్న మొన్నటి వరకూ వరంగల్ అర్బన్ జిల్లాలో మాత్రమే కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండగా ఇప్పుడు రూరల్ జిల్లాలో కూడా 36 నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కేసులు అదుపులోకి రావడంలేదు. ఒకే రోజున 73 నమోదయ్యాయి. నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, మెదక్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో సైతం ఎక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతూ ఉన్నాయి.