Fire Accident : మలక్‌పేట మార్కెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

by Ramesh N |
Fire Accident : మలక్‌పేట మార్కెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Hyderabad) హైదరాబాద్​లోని​​ మలక్​పేట్ (Malakpet market) మార్కెట్‌లో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. మార్కెట్‌లోని ఓ గోదాము వద్ద చిత్తు కాగితాలు తగులబెడుతుండగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో గోదాములో ఉన్న పేపర్ గ్లాసులు, టీ కప్పులు, వస్తువులు దగ్ధమయ్యాయి.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.

Next Story

Most Viewed