- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్టీ మారిన వారిని తిరిగి చేర్చుకునేది లేదు : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు..
దిశ, శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన ఏ నాయకుడిని కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ లోని గోదా కృష్ణ ఫంక్షన్ హాల్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తు పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గాంధీ వెళ్ళిపోవడం వల్ల నియోజకవర్గానికి ఒరిగేది ఏమీ లేదని అన్నారు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తుంచుకుంటుందని త్వరలో జరగబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో ఇక్కడ కష్టపడి పని చేస్తున్న వారికే టికెట్లు దక్కుతాయని ఆయన తెలిపారు.
త్వరలోనే నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారధ్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే కృష్ణారావుకు కానీ నాకు కానీ నేరుగా చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొత్తం గాడి తప్పిందని ఆరు గ్యారెంటీల పేరిట ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ జెండాని రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దు అని త్వరలోనే మనందరికీ మంచి రోజులు వస్తాయని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కార్పొరేటర్ రోజాదేవీ, మాజీ కార్పొరేటర్ రంగారావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.