Manipur: కుకీ మిలిటెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఎన్డీఏ ఎమ్మెల్యేల తీర్మానం

by vinod kumar |
Manipur: కుకీ మిలిటెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. ఎన్డీఏ ఎమ్మెల్యేల తీర్మానం
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌(Manipur)లోని జిరిబామ్ జిల్లా(Jiribalm distric)లో ఏడు రోజుల వ్యవధిలోనే ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు పిల్లల మృత దేహాలను స్వాధీనం చేసుకున్న తర్వాత రాష్ట్రంలోని ఎన్డీఏ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ హత్యలకు కారణమైన కుకీ మిలిటెంట్ల (Kukee miitants)పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ఏడు రోజుల్లోగా కుకీ మిలిటెంట్లకు చెందిన ఆర్గనైజేషన్స్‌ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటించాలని, కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)కు అప్పగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో అఫ్సా(Afspa) చట్టాన్ని విధిస్తూ ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సైతం సమీక్షించాలని వెల్లడించారు.

నిర్ణీత వ్యవధిలోగా ఈ తీర్మానాలపై చర్యలుతీసుకోకుంటే ఎన్డీఏశాసనసభ్యులు మణిపూర్ ప్రజలతో సంప్రదించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. మణిపూర్ మంత్రులు, శాసన సభ్యులు నివాసాలపై ఇటీవల జరిగిన దాడిని ఎమ్మెల్యేలు ఖండించారు. అత్యున్నత కమిటీ విచారణ ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు, నెలకొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. కాగా, రాష్ట్రంలో హింసాత్మ ఘటనలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలు కుకీ మిలిటెంట్లను హతమార్చిన అనంతరం ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కర్ఫ్యూ పొడిగింపు

మణిపూర్‌లోని 9 జిల్లాల్లో 7 జిల్లాలు అత్యంత హింసాత్మకంగా మారాయి. నిత్యం ఏదో ఒక ఘటన ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటోంది. దీంతో మణిపూర్ ప్రభుత్వం ఇంఫాల్ వెస్ట్ (Imphal west), ఇంఫాల్ ఈస్ట్ (Imphal east), బిష్ణుపూర్, కాక్చింగ్, కాంగ్‌పోక్పి, తౌబాల్, చురాచంద్‌పూర్ జిల్లాల్లో ఇంటర్నెట్, మొబైల్ సేవలపై నిషేధాన్ని నవంబర్ 20 వరకు పొడిగించింది. అలాగే పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం బీరెన్ సింగ్ నివాసం, రాజ్‌భవన్‌ వద్ద భద్రతను మరింత పెంచారు.

Advertisement

Next Story