సాదా బైనామాకు ఇదే చివరి అవకాశం

by Shyam |
సాదా బైనామాకు ఇదే చివరి అవకాశం
X

దిశ ప్రతినిధి, మెదక్: సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పిస్తున్న చివరి అవకాశం ఇదేనని, ఈ నెల పదో తేదీలోగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు కోరారు. హైదరాబాద్ నుంచి సిద్ధిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగు చేసే ప్రతీ భూమికి పాస్ బుక్ ఉండాలనీ, తద్వారా ప్రభుత్వం నుంచి అందే రైతు బంధు సాయం, రైతు బీమా వంటి పథకాలు అందుతాయని చెప్పారు. పాస్ బుక్ ఉండటం వల్ల వారికి ప్రభుత్వ మద్దతు ధర లాంటి సహాయం అందుతుందని తెలిపారు. తెల్లకాగితం‌పై రాసుకున్నా దరఖాస్తు చేసుకోవచ్చనీ, అటు వంటి దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి పట్టాలు ఇస్తుందన్నారు. ఒక వేళ తాతల నాటి నుంచి వంశపారంపర్యంగా భూమి సంక్రమించి ఉండి, ఎలాంటి కాగితాలు రాసుకోకున్నా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అటు వంటి దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి పట్టాలు ఇస్తుందని చెప్పారు. తొలి సారిగా మున్సిపల్ పరిధిలోని గ్రామాల్లో భూములను సైతం క్రమబద్ధీకరించుకునేందురు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారనీ, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Next Story