- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 మంది రెవెన్యూ ఉద్యోగులపై వేటు.. ఎక్కడంటే ?
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసేందుకు ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌శాఖపై కొరడా ఝుళిపిస్తున్న జగన్ సర్కార్ తాజాగా భూ రికార్డుల కుంభకోణాలపై దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల కుంభకోణంలో పలువురు అధికారులపై వేటు వేసింది. మరికొందరిపై క్రిమినల్ కేసులు పెట్టింది. అలాగే అవినీతి సొమ్మును ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తోంది. తాజాగా భూ రికార్డుల కుంభకోణాలపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం రెవెన్యూ కార్యాలయం పరిధిలో భారీ స్థాయిలో భూ కుంభకోణం జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రహస్య విచారణ చేపట్టారు అధికారులు.
ఈ విచారణలో వందల ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వీఆర్వోలు అమ్మేసినట్లు నిర్ధారణ అయ్యింది. 13 మంది వీఆర్వోలతో పాటు మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు పాత్ర ఉన్నట్లు ఆధారాలతో సహా ఉన్నతాధికారులు నిర్ధారించారు. విచారణకు సంబంధించిన ఓ నివేదికను విచారణ బృందం జిల్లా ఉన్నతాధికారులకు అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా మొత్తం 13 మంది వీఆర్వోలు, ముగ్గురు రెవెన్యూ కార్యాలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. గత కొంతకాలంగా మార్కాపురం డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందన కార్యాక్రమంలో కూడా పలువురు ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపించారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు రహస్యంగా విచారణ చేపట్టగా అవినీతి భాగోతం గుట్టురట్టైంది. అయితే ఈ భూ కుంభకోణంపై మరింత లోతుగా విచారణ జరిపితే మరికొందరిపై పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సమస్యల కోసం ప్రజలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని.. మామూళ్లు ఇస్తేనే పనిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు సైతం మామూళ్లు పంపిస్తుండటంతో బహిరంగంగా కొందరు రెవెన్యూ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు. మెుత్తానికి రెవెన్యూ అధికారుల అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.