HMDAలో అమ్మనున్న భూమలివే

by Shyam |
HMDAలో అమ్మనున్న భూమలివే
X

దిశ సిటీ బ్యూరో : ఆర్దిక సంక్షోభాన్ని అధిగమించేందుకు సర్కారు భూములను విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) పరిధిలోని పలు సర్కారు భూములను అధికారులు గుర్తించారు. నగరంలోనే అత్యంత ఎక్కువ ధర పలికే కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లోని పలు భూములను హెచ్ఎండిఏ అధికారులు గుర్తించారు. కోకాపేటలో సుమారు 50 ఎకరాలు, కోకాపేటలో దాదాపు 15 ఎకరాలను విక్రయించనున్నారు.

కోకాపేటలోని నియోపాలిస్ లే అవుట్ లో 7.72 ఎకరాల విస్తీర్ణలోనున్న ప్లాట్ నెంబర్ ఒకటి, 7.75 ఎకరాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ నెంబర్ రెండు, అలాగే 7.73 ఎకరాలున్న ప్లాట్ నెంబర్ మూడు, 8.94 ఎకరాల్లో ఉన్న ప్లాట్ నెంబర్ నాలుగు, అలాగే 7.56 ఎకరాల విస్తీర్ణం కల్గిన ప్లాట్ నెంబర్ 12, 7. ప్లాట్ నెంబర్ 13లోని 7.57 ఎకరాల స్థలాన్ని విక్రయించాలని సర్కారు నిర్ణయించింది. వీటితో పాటు రోడ్ నెంబర్ ఏడులో నియోపాలిస్ లే అవుట్ లోని రోడ్డు వైపు దక్షిణాన ఉన్న ప్లాట్-ఏ లోని ఒక ఎకరం భూమిని కూడా విక్రయించనున్నారు. గొల్డెన్ లైల్ లే అవుట్ లోని 1.65 ఎకరాల భూమిని అమ్మేందుకు హెచ్ఎండిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దీంతో పాటు ఖానామెట్ లో 3.15 ఎకరాల్లో ఉన్న ప్లాట్ నెంబర్ నాలుగు, అంతే విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ నెంబర్ ఐదుతో పాటు 3.69 ఎకరాల్లో ఉన్న ప్లాట్ నెంబర్ 12, అలాగే ప్లాట్ నెంబర్ 14లోని 2.92 ఎకరాల స్థలంతో పాటు ప్లాట్ నెంబర్ 17లోని 2.10 ఎకరాల స్థలాన్ని వేలం పాట ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్న వివాదాస్పదమైన భూములున్న ఈ రెండు ప్రాంతాల్లోని ఈ స్థలాను ప్రజలకు ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా విక్రయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రెండు ప్రాంతాల్లోని ఈ స్దలాల్ని విక్రయిస్తే సర్కారుకు దాదాపు రెండున్నర వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ భూములకు సంబంధించిన అన్ని రకాలు సమాచారం, పత్రాలను పురపాలక, పట్టణాభివృద్ది శాఖకు పంపినట్లు అధికారులు తెలిపారు. కానీ వేలం పాట కార్యక్రమాన్ని మాత్రం హెచ్ఎండిఏ అధికారులే నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

Advertisement

Next Story

Most Viewed