- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందుకే కేటీఆర్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాం
దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: గత రెండు రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటనకు వచ్చిన సమయంలో ఓ కుటుంబం ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో వారు కేటీఆర్ ను కలవలేకపోయారు. కానీ, ఈ విషయం మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే టీఆర్ఎస్ నాయకుల భూకబ్జా విషయంలోని వారు మంత్రిని కలిసే ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అసలు విషయం పరిశీలిస్తే టీఆర్ఎస్ నాయకుల బాగోతం బయటపడింది. వివరాల ప్రకారం మహబూబ్ నగర్ పట్టణంలోని లక్ష్మి దేవమ్మ ప్రభుత్వ శాఖలో 40 సంవత్సరాలుగా అటెండర్ గా చేసి రిటైర్ అయ్యింది. తనకు వచ్చిన డబ్బులతో కూమరులైన గంటెల వెంకటేష్, గంటేల శివప్రసాద్ ల కొరకు వారి పేరు మీదుగా మహబూబ్ నగర్ పట్టణ శివారులో విడి విడిగా మ్యాకల అంజయ్య, మ్యాకల బాలక్రిష్టయ్య ల దగ్గర సర్వే నంబర్ 860, 861, 877 ల లో ఉన్న 4 ఎకరాలలో 15 గుంటల భూమిని కొనుగోలు చేసింది. తదనంతరం సబ్ రిజిస్ట్రార్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారికి పాస్ బుక్కులు కూడా వచ్చినయ్. తెలంగాణా రాష్ట్రం వచ్చినంక కొత్త పాస్ బుక్కుల కోసం కుటుంబం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం కనిపించలేదు. లంచాల కోసం సదరు అధికారులు వేధింపులకు గురి చెశారు. ఇదే అదనుగా భావించి మ్యాకల బాలక్రిష్టయ్య చిన్న కొడుకు మ్యాకల శ్రీను అతని కూమరుడు స్థానిక టీఆర్ఎస్ నాయకుల అండతో ఆ భూమి మాదని వెంకటేష్ శివప్రసాద్ లపై దాడి చేసి భూమి కబ్జాలో ఉన్నారు. భాదిత కుటుంబీకులు స్థానిక నాయకులకు భయపడి మంత్రి దృష్టికి తీసుకు పోలేదు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆయనను కలిసి తమ గొడును వెల్లబోసుకుందామని వారి ఇంటి ముందు వెళ్తున్న కాన్వాయ్ కు అడ్డంగా వెళ్లామని వారు తెలిపారు. న్యాయం కోసం కేటీఆర్ ని కలవాలంటే స్థానిక టీఆర్ఎస్ నాయకుల మద్దతు అవసరం. కానీ, కబ్జా చేసిందే వారి కనుసన్నల్లో కాబట్టి కేటీఆర్ ను కలిసేందుకు వేరె గత్యంతరం లేకనే కాన్వాయ్ కు అడ్డంగా వెళ్లామని భాదిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ యువ నాయకులు మున్నురూ రవి వారిని కలిసి మాట్లాడుతూ కొందరు నాయకులు చేస్తున్న పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, ఈ విషయంపై పార్టీ పెద్దల దృష్టికి తీసుకేళ్లి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.