- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో ఆ కార్లకు పెరుగుతున్న డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబొర్ఘిని భారత్‌లో రాబోయే నాలుగేళ్లకు రెట్టింపు అమ్మకాల లక్ష్యాన్ని నిర్ధేశించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. తమ వాహనాలకు బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో దేశీయంగా 300 కార్ల విక్రయాల మైలురాయిని దాటామని, సెప్టెంబర్ నెలలో ఈ మార్కును చేరుకున్నట్టు కంపెనీ తెలిపింది. 2012లో దేశీయంగా అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించిన సంస్థ ప్రస్తుతం రూ. 3.16 కోట్ల ప్రారంభ ధరతో వివిధ రకాల సూపర్ లగ్జరీ కార్లను విక్రయిస్తోంది. మొదటి 300 యూనిట్ల అమ్మకాలను సాధించేందుకు తమకు దశాబ్ధానికి పైగా సమయం పట్టిందని, ఇందులో సగం గత నాలుగేళ్లలోనే నమోదయ్యాయని లంబొర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ చెప్పారు.
‘గత నాలుగేళ్లలో 150 కంటే ఎక్కువ కార్లను విక్రయించగలిగాం. ముఖ్యంగా మూడేళ్లుగా భిన్నమైన పరిస్థితులను చూడగలుగుతున్నాం. రానున్న రోజుల్లో మరింత డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. ఇప్పుడున్న స్థాయిలో రెట్టింపు అమ్మకాలను సాధించడానికి 3-4 ఏళ్లకు సాధ్యమవుతుందని, రెండేళ్లలో 450 యూనిట్ల మార్కును చేరుకుంటామని’ శరద్ అగర్వాల్ తెలిపారు. దీనికోసం కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టామని, దేశీయ వినియోగదారులకు అనుగుణమైన మోడళ్లను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని శరద్ వివరించారు.