- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భాగ్యనగరం బోనమెత్తిన వేళ.. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసే!
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం బోనమెత్తింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ప్రతీఏటా ఆషాడమాసంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది కరోనా కారణంగా బోనాలు ఘనంగా నిర్వహించడం సాధ్యం కాకపోయినా.. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవాన్ని మళ్లీ తిరిగి తీసుకొచ్చింది. బోనాల పండుగను అధికారంగా, గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంతో పాటు నగరంలోని చాలా చోట్ల బోనాల పండుగ వాతావరణం నెలకొంది.
ఉదయం నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. లాల్ దర్వాజలో అమ్మవారు సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భాగ్యనగరం బోనమెత్తడంతో ఎక్కడ చూసిన ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఎలాంటి అవాంఛీనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముందస్తుగా హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు.