- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో ముగిసిన లక్ష్యాసేన్ ప్రస్థానం
దిశ, స్పోర్ట్స్: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్య సేన్ ప్రస్థానం శుక్రవారం ముగిసింది. బర్మింగ్‌హామ్‌లోని యుటిలిట ఎరేనా కోర్ట్‌నెంబర్ 2లో మార్క్ కాల్జోవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 21-17, 16-21, 21-17 తేడాతో లక్ష్య సేన్ ఓడిపోయాడు. తొలి గేమ్ కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకున్న లక్ష్య సేన్.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం పట్టు కోల్పోయాడు. టోక్యో ఒలంపిక్స్ కోసం ర్యాంకును మెరుగు పరుచుకోవడానికి లక్ష్య సేన్ తీవ్రంగా శ్రమిస్తున్నా.. చివరి రౌండ్ మ్యాచ్‌లలో విఫలమమవుతున్నాడు. ఈ ఓటమి అతడికి మరింత భారంగా మారనున్నది. మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ 1 కెంటో మొమోత క్వార్టర్స్‌లో ఓడిపోయాడు. మలేషియాకు చెందిన జిల్ జియాపై 16-21, 19-21 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక మహిళల డబుల్స్‌లో అశ్వని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడి కూడా క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. నెదర్లాండ్స్‌కు చెందిన సెలెనా పీక్, చెర్లీ సినెన్ జోడీపై 22-24, 12-21 తేడాతో ఓటమిపాలై ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించారు. మరో క్వార్టర్స్‌లో పీవీ సింధు, జపాన్‌కు చెందిన యమగుచి తలపడాల్సి ఉన్నది.