ఇంట్లోనే మంచు మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్

by Shyam |
ఇంట్లోనే మంచు మనోజ్ బర్త్ డే సెలబ్రేషన్స్
X

మంచు మనోజ్.. మనసేమో మంచుకొండ. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుండే.. బంగారు కొండ. అంతా బాగుంటుంది, అందరం బాగుంటామని భరోసా ఇచ్చే.. కొండంత అండ. అలాంటి మంచి మనిషి, నటుడు అయిన మనోజ్ పుట్టినరోజున.. ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘నీలాంటి గొప్ప మనసున్న వ్యక్తికి అంతా మంచే జరుగుతుందని.. త్వరలో రాబోయే చిత్రం అహం బ్రహ్మాస్మి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా తనతో కేక్ కట్ చేయించి విష్ చేసిన మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో లక్ష్మితో పాటు మోహన్ బాబు, నిర్మల ఉన్నారు. తనకు మాత్రమే కాదు అందరి కష్టాల్లో పాలు పంచుకుంటూ వీలైనంత వరకు ఆ బాధలను దూరం చేసే మనోజ్‌కు.. ప్రేమ, శాంతి, విజయం అన్నీ కోకొల్లలుగా లభించాలని లక్ష్మి కోరుకుంది. ‘నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానని చెప్పలేను.. కానీ నువ్వు మాత్రం 150 ఏళ్లు హాయిగా ఉండాలని కోరుకుంటున్నా’ అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed