కరోనా కాలాన్ని గుర్తుంచుకోండి.. లక్ష మొక్కలు నాటండి

by Shyam |   ( Updated:2021-08-11 09:09:08.0  )
Former Vice MP Raj Bhopal Goud
X

దిశ, రాజేంద్రనగర్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ వైస్ ఎంపీపీ పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడాన్నే లక్ష్యంగా పెట్టుకొని, లక్ష మొక్కలు నాటి, భావితరాలకు కానుకగా అందించాలని కోరారు. ఇందులో భాగంగానే బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని పోచమ్మ గుట్టలో సర్పంచ్ సుష్మ, శాంతి యువజన సంఘం సభ్యులతో కలిసి శంషాబాద్ మాజీ వైస్ ఎంపీపీ పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ మొక్కలు నాటారు.

అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆక్సిజన్ అందక దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో మృతి చెందిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. అని దాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని కాపాడుతూ మొక్కలు నాటాలని, దాని మూలంగా అందరికీ ఆక్సిజన్ అందించిన వారమవుతామని అన్నారు. ప్రతిఒక్కరూ ఆరు మొక్కల చొప్పున నాటి హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. పాలమాకుల గ్రామంలో లక్ష మొక్కలు నాటాలని, ఇప్పటివరకు 25 వేల మొక్కలు నాటామని, మిగతా 75 వేల మొక్కలు కూడా ఆరు నెలల్లో నాటి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి యువజన సంఘం సభ్యులు, మన ఊరు మన నేస్తం కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed