Lady Gaga: లేడీ గాగాపై నెలల తరబడి నిర్మాత అత్యాచారం

by Shyam |   ( Updated:2021-05-21 03:01:50.0  )
Lady Gaga: లేడీ గాగాపై నెలల తరబడి నిర్మాత అత్యాచారం
X

దిశ, సినిమా : పాప్ స్టార్ లేడీ గాగా కెరియర్ తొలినాళ్లలో తనపై జరిగిన అత్యాచారం గురించి వివరించింది. ఓఫ్రా విన్‌ఫ్రే, ప్రిన్స్ హారీస్ ఆపిల్ టీవీ ప్లస్ అన్‌స్క్రిప్టెడ్ సిరీస్ ‘ద మి యూ కాంట్ సీ’ ప్రోగ్రామ్‌లో తన పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌పై ఓపెన్ అయింది. 19 ఏళ్ల వయసులో ప్రొడ్యూసర్ తనను రేప్ చేశాడని తెలిపింది. తనకన్నా 20 ఏళ్ల పెద్దవాడైన నిర్మాత.. బట్టలు తీయకపోతే మ్యూజిక్ కెరియర్ లేకుండా చేస్తానని బెదిరించాడని, కొన్ని నెలల పాటు రూమ్‌లో లాక్ చేసి అత్యాచారం చేశాడని వివరించింది. ఆ తర్వాత వామిటింగ్స్ చేసుకుంటూ నొప్పితో బాధపడుతున్న తనను అమ్మానాన్న నివసిస్తున్న ఇంటి కార్నర్‌లో పడేసి వెళ్లిపోయాడని చెప్పింది. ఈ ఇన్సిడెంట్‌తో మానసికంగా కుంగిపోయిన తాను బయటపడేందుకు రెండున్నర సంవత్సరాలు పట్టిందని చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత కూడా ఆ నొప్పి వెంటాడుతుండటంతో ఉపశమనం పొందేందుకు హాస్పిటల్‌కు వెళ్తే ఎన్ని ఎమ్‌ఆర్ఐ, స్కాన్లు తీసినా వైద్యులు ఏమీ కనుక్కోలేకపోయాన్న లేడీ గాగా థెరపీ, బాడీ కేరింగ్, మ్యూజిక్‌తో మొత్తానికి ఉపశమనం పొందగలిగానని వివరించింది.

Advertisement

Next Story