బ్రిట్నీ స్పియర్స్‌పై ఆ సింగర్ ఎమోషనల్ కామెంట్స్..

by Shyam |
బ్రిట్నీ స్పియర్స్‌పై ఆ సింగర్ ఎమోషనల్ కామెంట్స్..
X

13 ఏళ్ల పాటు తండ్రి కన్జర్వేటర్‌షిప్‌లో ఇబ్బందులు పడ్డ ఫేమస్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు ఇటీవల ఊరట లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గుడ్ న్యూస్‌పై స్పందించిన మరో పాప్ సింగర్ ‘లేడీ గాగా’ బ్రిట్నీపై తన అభిమానాన్ని చాటుకుంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో బ్రిట్నీపై తన ఫీలింగ్స్ పంచుకుంటూ గాగా భావోద్వేగానికి లోనైంది.

‘కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి బ్రిట్నీ అంటే ఎంతో ఇష్టం. నాకు స్ఫూర్తిగా నిలిచిన వారిలో ఆమె మొదటి వ్యక్తి. తన మెంటల్ స్ట్రెంత్‌ను చాలా గౌరవిస్తా. ఇప్పటి వరకు తను ఎంతో మందిని సాధికారత వైపు నడిపించింది. ఇకపై కూడా అలాగే చేస్తుందని కోరుకుంటున్నా. నిజానికి తనకు అలా జరగాల్సింది కాదు. అయినా ప్రస్తుతం కన్జర్వేటర్‌షిప్‌ తొలగిపోయినందుకు హ్యాపీగా ఉంది’ అంటూ పోస్టు చేసింది. ఇక గాగాతో పాటు చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా బ్రిట్నీ స్పియర్స్‌కు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story