- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ హీరోకి సమోసా ఇచ్చిన ఫ్యాన్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: హీరో లేదా హీరోయిన్ అంటే ఎంత పిచ్చి అభిమానం ఉంటుందో చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. లవ్ లెటర్స్, గిఫ్ట్స్, టాటూస్ ఇలా చాలా రకాలుగా తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు అభిమానులు. కొందరైతే అభిమాన నటులను కలిసేందుకు ఇంటి ముందు గంటల తరబడి వెయిట్ చేస్తుంటారు . ఈ క్రమంలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కు ఓ వీరాభిమాని ఇలాంటి అనుభవాన్నే మిగిల్చింది. విక్కీ ఇండోర్‌లో ఓ షూటింగ్‌కు హాజరయ్యేందుకు వస్తున్నాడని తెలుసుకున్న లేడీ ఫ్యాన్..తనకు ఆకలేస్తుందేమోనని సమోసా, జిలేబితో పాటు ఎయిర్‌పోర్టుకు వచ్చేసింది. విమానాశ్రయంలో విక్కీకి స్నాక్స్ ఇచ్చి ఆకలిగా ఉంటారు కదా తినమని చెప్పి హ్యాపీగా ఓ కూల్ ఫొటో దిగి వెళ్లిపోయింది. ఈ గెశ్చర్‌తో షాక్‌కు గురికావడంతో పాటు హ్యాపీగా ఫీల్ అయిన విక్కీ ఈ ఎక్స్‌పీరియన్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
చేతిలో సమోసాతో ఉన్న పిక్ షేర్ చేసిన విక్కీ..‘నేను తినలేనని చెప్పాను. కానీ, తినకుండా తనను తాను ఆపలేకపోతున్నా’ అంటూ జరిగిన విషయాన్ని అభిమానులకు వివరించాడు. ఆకలితో ఉన్నానని తెలిసిన అభిమానిని పొందడం ఆనందంగా ఉంది హర్షిత(అభిమాని) అని తెలిపాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా తనను కలిసేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిందని.. ఆమెపై కోపగించుకోకూడదని అమ్మాయి అమ్మానాన్నలను కోరాడు. ఇక ఇండోర్ సమోసాలు చాలా టేస్టీగా ఉన్నాయని కాంప్లిమెంట్ ఇచ్చాడు.