బయటకు ఉచితం.. లోపల దందా.. ఆగ్రహంలో ప్రజలు

by Shyam |   ( Updated:2021-12-17 07:01:36.0  )
medak
X

దిశ‌, న‌ర్సాపూర్‌: అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు సామాజిక భ‌ద్రతతో పాటు సంక్షేమ ప‌థ‌కాల‌ను క‌ల్పించాల‌నే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్‌ను ఆగ‌స్టు 26న తీసుకు వచ్చింది. ఇందులో చేర‌డం కోసం స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం మెదక్ జిల్లాలో మొద‌లు పెట్టారు. అసంఘ‌టిత రంగ కార్మికులు త‌మ పేర్లు న‌మోదును ఉచితంగా చేసుకోవాల‌ని జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్టర్ ప్రతిమాసింగ్ ప్రక‌టించారు. గ్రామాల‌లో గ‌త వారం రోజులుగా స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం కొన‌సాగుతుంది. అయితే స‌భ్యత్వం పొంద‌డం కోసం కార్డు పేరుతో ఒక్కొక్కరి వ‌ద్ద నుంచి రూ.50 వ‌సూలు చేస్తున్నారు.

గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యాల‌లో బ‌య‌ట ఉచితంగా స‌భ్యత్వ న‌మోదు బోర్డులు పెట్టి లోప‌ల మాత్రం ఒక్కొక్కరి వ‌ద్ద నుంచి రూ. 50 వ‌సూలు చేయ‌డంపై ప్రజ‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా స‌రైన ప్రచారం సైతం చేయ‌క‌పోవ‌డంతో గ్రామాల‌లో కేవ‌లం 200 లోపే స‌భ్యత్వ న‌మోదు ప‌క్రియ సాగుతుంది. న‌ర్సాపూర్ మండ‌లంలోని లింగాపూర్‌, గొల్లప‌ల్లి, బ్రాహ్మణ‌ప‌ల్లి, నారాయ‌ణ‌పూర్ గ్రామాల‌లో ఈ శ్రమ్ ఉచిత స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమం చేప‌ట్టారు.

Advertisement

Next Story

Most Viewed