‘ల్యాబ్ ఆన్ వీల్స్’ విద్యార్థులకు సైన్స్ అవగాహనపై వినూత్న కార్యక్రమం

by  |
‘ల్యాబ్ ఆన్ వీల్స్’ విద్యార్థులకు సైన్స్ అవగాహనపై వినూత్న కార్యక్రమం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సైన్స్ పై విషయ పరిజ్ఞానము పెంపొందించడంతో పాటు సైన్స్ సబ్జెక్ట్ వైపు ప్రోత్సహిస్తూ వారితో ప్రాజెక్టులు నిర్వహించే విధంగా క్లాసులు నిర్వహించడం కోసం యూత్ ఫర్ సేవ వరంగల్ చాప్టర్ సభ్యులు వినూత్న కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు. సభ్యులంతా కలిసి ‘ల్యాబ్ ఆన్ వీల్స్’ అనే మొబైల్ సైన్స్ వాహనాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులతో నూతన ఆవిష్కరణలను చేయించడం, సైన్స్ లో మెలకువలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వైపు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకున్నారు.

అయితే, ఈ వాహనాన్ని వరంగల్ డీఈవో వాసంతి ఆవిష్కరించి మాట్లాడుతూ.. పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కార్పొరేట్ వారితో పోటీ పడి చదివేలా ఈ మొబైల్ వాహనం దోహద పడుతుంది అన్నారు. తరగతి గదిలో టీచర్స్ చెప్పే బోధనతో పాటు ఇలాంటి మేలుకువలు ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా యూత్ ఫర్ సేవా సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవ సంస్థ సభ్యులు విజయలక్ష్మి, మాలతి, శ్రీదేవి, ప్రొ.రామన్న, నరసింహచారి, కంది శ్రీనివాస్ రెడ్డి, సంస్థ వాలంటరీస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed