ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా : ఎల్.రమణ

by Sridhar Babu |
L. Ramana
X

దిశ, జగిత్యాల: అందరినీ కలుపుకొని ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎల్. రమణ అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం జగిత్యాల చేరుకున్న ఆయనకు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, ఓటు వేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే, జెడ్పీ చైర్ పర్సన్, మున్సిపల్ చైర్ పర్సన్, కార్పొరేటర్లకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రుణపడి ఉంటానని అన్నారు. తనకు ఉన్న 27 సుధీర్ఘ రాజకీయ అనుభవంతో స్థానిక సంస్థల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

కాగా, జగిత్యాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎల్.రమణ నివాసంలో మంగళవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిసి, పూలమాలతో శుభాకాంక్షలు తెలిపారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రమణ వ్యక్తిగత అభిమానులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రమణ నివాసానికి చేరుకోవడంతో రమణ ఇంటి వద్ద సందడి నెలకొంది.

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్‌కు ఎల్.రమణ వ్యక్తిగతంగా కూడా దగ్గరివాడు కావడంతో జగిత్యాలకు చేరుకున్న రమణను వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story