సీతమ్మ కోణంలో విజయేంద్ర ప్రసాద్ రామాయణం

by Jakkula Samataha |
సీతమ్మ కోణంలో విజయేంద్ర ప్రసాద్ రామాయణం
X

దిశ, సినిమా: రామాయణం నేపథ్యంలో బాలీవుడ్ నుంచి మరో సినిమా రాబోతోంది. ‘బాహుబలి’ రైటర్ కేవీ విజయేంద్ర ప్రసాద్ ఈ పాన్ ఇండియా మూవీకి కథ అందించబోతున్నారు. ‘సీత – ది ఇన్‌కార్నేషన్’ పేరుతో తెరకెక్కనున్న సినిమాను.. ఎ హ్యూమన్ బీయింగ్ స్టూడియోస్ నిర్మించనుంది. సీతమ్మ కోణంలో ఈ ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం రాబోతుండగా.. వీఎఫ్ఎక్స్ బేస్డ్ జర్నీ ఆడియన్స్‌కు అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని తెలిపారు మేకర్స్. కాగా కాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహించనున్న సినిమాకు మనోజ్ ముంతాషీర్ లిరిక్స్, డైలాగ్స్ అందించనుండగా.. సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Advertisement

Next Story