శ్రీలంక క్రికెటర్ అరెస్ట్

by Shyam |
శ్రీలంక క్రికెటర్ అరెస్ట్
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక టెస్టు, వన్డే క్రికెట్ బ్యాట్స్‌మెన్ కుషాల్ మెండిస్ (25)ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం పనదుర ప్రాంతంలో తన కారులో వెళ్తున్న మెండిస్ చేసిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న 65ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదం ఉదయం 5.30గంటల సమయంలో జరిగినట్లు స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాదానికి కారకుడైన మెండిస్‌ను అరెస్టు చేశారు. పనదురలోని హొరెతుదువా సమీపంలోని 13వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మెండిస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. కాగా, అంతకుముందు బౌలర్ షెహాన్ మధుశంక ఒక డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. మెండిస్ అరెస్టు విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంకా స్పందించలేదు.

Advertisement

Next Story