నంద్యాలలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి

by srinivas |   ( Updated:2020-06-27 01:22:20.0  )
నంద్యాలలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటన మరవకముందే కర్నూలు జిల్లాలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకుంది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో విషవాయువు లీక్‌ అయింది. దాన్ని పీల్చిన ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషవాయువు భయంతో కర్మాగారం నుంచి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి అంబులెన్సులు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులంతా భయాందోళనలకు గురవుతున్నారు. గ్యాస్ లీకేజిని అదుపు చేయడానికి సిబ్బంది ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

Next Story