- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం కన్నా కర్ణాటకే మేలు..
దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలోని కున్సి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు ఆడిగిన ప్రయోజనం లేకపోవడంతో విసిగిపోయిన ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఈరోజు ఉదయం రాయిచూరు ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ కలిసి వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సాయంత్రం లోపు రాయిచూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి కున్సి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ద్రుష్టిలో పెట్టుకుని కర్ణాటక సరిహద్దు జిల్లాల ప్రజలు తెలంగాణలో కలవాలని పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు చెప్పడం ఇకనైనా మానుకోవాలని విమర్శించారు.
వివరాలోకి వెళితే.. మక్తల్ నియోజకవర్గంలోని సరిహద్దు అయిన చేగుంట, కున్సి గ్రామాలు కర్నాటక రాష్ట్రం అయిన యాదగిరి, రాయిచూరు హైవేపై ఉంటాయి. కానీ ఈ మార్గం గుండా రాయచూర్ నుంచి గుల్బర్గా ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ సర్వీసులు మాత్రమే తిరుగుతుంటాయి. కున్సి గ్రామంలో తెలంగాణ బస్టాప్ ఉన్నా టీఎస్ఆర్‌టీసీ బస్సులు తిరగవు. కర్నాటక బస్సులు మాత్రం ఇక్కడ స్టాప్ లేకపోవడంతో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్ స్టాప్‌కు టికెట్ తీసుకొని కున్సి గేటు దగ్గర ప్రజలు దిగాల్సి వస్తుంది. దీంతో విసిగిపోయిన ప్రజలు తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని, కనీసం మీరైనా పట్టించుకున్నారని రాయిచూరు ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్‌కు ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం లోపు సర్క్యూలర్ జారీ అవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కన్నా.. కర్ణాటక ప్రభుత్వమే తన గోడు పట్టించుకుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.