- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారంటైన్‌లోకి కుంభమేళ యాత్రికులు
దిశ, తెలంగాణ బ్యూరో: కుంభమేళాకు హాజరైన యాత్రికులందరూ క్వారంటైన్‌లోకి వెళ్లాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1 నుంచి 17 వరకు కుంభమేళకు వెళ్లిన ప్రతి యాత్రికులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 14 రోజుల పాటు బయటకు రాకుండా కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ప్రత్యేక గదిలో ఉంటూ, తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని సూచించారు.
దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి కరోనా వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సలహాలు సూచనల కోసం 104 నెంబర్ కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కుంభమేళకు వెళ్లిన యాత్రికుల నుంచి వ్యాధి వ్యాప్తి కాకుండి చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం కుంభమేళ యాత్రికులకు నిబంధనలు విధించింది.