‘దళిత బంధు పేరిట సీఎం కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలు’

by  |
‘దళిత బంధు పేరిట సీఎం కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలు’
X

దిశ,ములుగు : ఉప ఎన్నికల ఓట్ల కోసం సీఎం కేసీఆర్ దళితుల వర్గాలను మభ్యపెట్టేందుకే దళిత బంధు పేరిట మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఆత్మగౌరవ దండోరా సభా ములుగు ఇంఛార్జి కూచన రవళి రెడ్డి అన్నారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమం కొరకు ఊరూరా తిరుగుతూ దళిత, గిరిజనులకు జరుగుతున్న మోసాలను వివరిస్తూ ఆగస్టు18న రావిర్యాల మహా సభకు ప్రతి ఒక్కరు రావాలని కోరారు.

ఈ సందర్భంగా మంగళవారం ములుగు జిల్లా ములుగు మండలంలోని ఇంచెర్ల , బరిగాలనిపల్లి గ్రామల్లో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో ఊరూరా దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కూచన రవళి రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు రాగానే ఓట్ల కోసం దళిత వర్గాలను మభ్యపెట్టడానికి దళిత బంధు పేరిట మోసపూరిత వాగ్దానం చేస్తూ, హుజురాబాద్ నియోజకవర్గ దళితుల మీద కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తన్నారు అన్నారు. ప్రేమ నటిస్తున్న కేసీఆర్ గారికి దళితుల మీద నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే… తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితున్ని చేస్తా అని ఎందుకు చేయలేదు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి , ఎందుకు ఇవ్వలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ఎందుకు ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి రెండు సంవత్సరాలకు వచ్చే ప్రమోషన్స్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. ఇప్పుడైనా మేల్కొని దళిత గిరిజనులను మోసం చేస్తున్న కేసీఆర్, యుద్ధం చేస్తున్న రేవంత్ రెడ్డి సభకు విచ్చేసి, రాష్ట్రం మొత్తం దళిత, గిరిజన బంధు ఇచ్చేలా ప్రతి దళిత- గిరిజన కుటుంబానికి పది లక్షలు వచ్చేలా, దళిత- గిరిజనులకు మూడు ఎకరాల భూమి వచ్చేలా, ఇంటికో ఉద్యోగం వచ్చేలా, డబుల్ బెడ్ ఇండ్లు వచ్చేలా, పోడు భూములకు పట్టాలు వచ్చేలా ఆత్మ గౌరవ దండోర మోగించి దొరల గుండెల్లో గుణాపాలైదాం రండని పిలుపునిచ్చారు. అదే విధంగా రేపు జరగబోయే దళిత-గిరిజన ఆత్మ గౌరవ దండోర సభ రావిర్యాలకు రమ్మని పిలుపునిస్తూ, ఊరూరా తిరుగుతూ ప్రజలకు చైతన్యాన్ని కలిగించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్, ములుగు మండల అధ్యక్షులు చాంద్ పాషా, మట్టేవాడ తిరుపతి, ఇంచెర్ల గ్రామ అధ్యక్షులు మాదాసు శ్రీను, బరిగలానిపల్లి గ్రామ అధ్యక్షుడు పవన్, మాజీ ఎంపీటీసీ కొమురయ్య, వజ్జల రవి, మట్టేవాడ బక్కయ్య, శ్రీను గౌడ్, వెంకటేష్, పత్తి రాజమౌళి, కుమారస్వామి, జగదీష్, లక్ష్మణ్, రాము, రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story