నటి షాకింగ్ కామెంట్.. బోల్డ్ సీన్‌ కోసం ఆ డైరెక్టర్ వేధించాడు

by Shyam |
నటి షాకింగ్ కామెంట్.. బోల్డ్ సీన్‌ కోసం ఆ డైరెక్టర్ వేధించాడు
X

దిశ, సినిమా: బాలీవుడ్ వెబ్‌ సిరీస్‌ ‘సాక్రెడ్ గేమ్స్‌’లో ట్రాన్స్ఉమన్ ‘కుకూ’ పాత్రలో నటించిన కుబ్రా సైత్.. రీసెంట్‌గా మాషబుల్ ఇండియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సిరీస్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ వల్ల చాలా ఇబ్బందిపడ్డానని తెలిపింది. ఓ సీన్‌లో న్యూడ్‌గా నటించాల్సి ఉండగా, సరిగా రావడం లేదంటూ ఇబ్బందిపెట్టిన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. మళ్లీ మళ్లీ చేయమంటూ మొత్తం ఏడు టేక్స్‌ తీసుకున్నాడని చెప్పింది. ఆ సమయంలో కశ్యప్ చేష్టలకు తట్టుకోలేక సెట్‌లోనే ఏడ్చేశానని కుబ్రా గుర్తుచేసుకుంది. దీంతో తన దగ్గరకు వచ్చిన దర్శకుడు.. రీటేక్ చేస్తున్నందుకు బాధపడొద్దని, సీన్ బాగా రావాలన్నదే తన తాపత్రయమని వివరించినట్లు పేర్కొంది. ఇక సల్మాన్ ఖాన్ నటించిన ‘రెడీ’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కుబ్రా.. ఆ తర్వాత ‘జవానీ జానేమాన్, డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే’ వంటి చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది.

Advertisement

Next Story