- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో సీఎం కుర్చీపై కేటీఆర్!
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ సీఎం అవుతారన్న ఊహాగానాలు రాష్ట్రంలో తరచుగా వినపడుతున్నాయి. మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్ సైతం అప్పట్లో మీడియా ముఖంగానే కేటీఆరే సీఎం అని సంకేతాలిచ్చారు. అయితే ఇటీవల దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో ఆ విషయం పక్కకు పోయింది. మళ్లీ తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రెడ్యా నాయక్..కేటీఆర్‌ను త్వరలోనే సీఎం కుర్చీపై చూస్తామని, వచ్చే ఏడాదే ఆ దృశ్యం కళ్ల ముందు కనపడుతుందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధులతో రెండు ట్రాక్టర్లను బుధవారం రెడ్యా నాయక్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలోపు కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మధ్య తాను మంత్రి కేటీఆర్‌ను కలిసి కురవి మండలం సీరోలు గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని, నర్సింహులపేటలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని, డోర్నకల్‌లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు చేయాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.
అయితే దేశాన్ని నడపడంలో బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని కొన్నినెలలుగా కేసీఆర్ విమర్శిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ నేతలతో మాట్లాడుతున్నానని, త్వరలోనే నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తా అని ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నింటికీ బలం చేకూరుస్తూ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కేటీఆర్ సీఎం కాబోతున్నారని, మార్చిలోపే అది జరిగితీరుతుందని చేసిన కామెంట్లు రాజకీయాల్లో ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారాయి.