చెరువు కట్టకు వెంటనే మరమ్మతులు :కేటీఆర్

by Shyam |   ( Updated:2020-10-17 02:30:55.0  )
చెరువు కట్టకు వెంటనే మరమ్మతులు :కేటీఆర్
X

దిశ, వెబ్‎డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలో గండి ప‌డిన అప్ప చెరువును మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు అప్ప చెరువు గండి పడి జాతీయ రహదారి 44 పూర్తిగా కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారులు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి ర‌హ‌దారిని పున‌రుద్ధ‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అప్ప చెరువులో అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించాలని అధికారులను అదేశించారు. సాగునీటి శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని తెగిన చెరువు క‌ట్ట‌కు వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించడంతో పాటు ఎలాంటి అంటు రోగాలకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Next Story