- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామాజిక బాధ్యతగా మొక్కలను రక్షించాలి
దిశ, న్యూస్‌బ్యూరో: నాటిన ప్రతి మొక్కను సామాజిక బాధ్యతగా అందరూ రక్షించుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా గురువారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బోయగూడలోని జీహెచ్ఎంసీ పార్క్‌లో మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, అడిషనల్ కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ బి. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి కమిషనర్ ముకుంద రెడ్డి, హార్టికల్చర్ డిప్యూటి డైరెక్టర్ నాగిరెడ్డి, ఈ శ్రీనివాస్, సికింద్రాబాద్ తహశీల్దార్ బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈచ్ వన్.. ప్లాంట్ వన్
పల్లెలు, పట్టణాలు బాగుండాలంటే ‘ఈచ్ వన్.. ప్లాంట్ వన్’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఇంటిలో, వీధిలో పెంచుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఔటర్ రింగ్‌రోడ్డులోని దుండిగల్ ఎగ్జిట్– 5 వద్ద హెచ్ఎండీఏ నర్సరీ సమీపంలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. అనంతరం హెచ్ఎండీఏ రూపొందించిన ‘హరితహారం బ్రోచర్’ ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 110 ఎకరాల హెచ్ఎండిఏ స్థలంలో యాదాద్రి మోడల్(మియావాకీ) పద్ధతిలో 6.50 లక్షల మొక్కలను నాటి చిట్టడవిగా మార్చనున్నట్లు ప్రకటించారు. ఓఆర్ఆర్ చుట్టు తిరిగి ప్రతి 10కిలోమీటర్లకు ఒక ‘థీమ్’ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎస్.కృష్ణవేణి కృష్ణ, నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కొలను నీలా గోపాల్‌రెడ్డి, కొంపల్లి కార్పొరేషన్ మేయర్ ఎస్. శ్రీశైలం యాదవ్, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్, మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ బి.శ్రీనివాస్, ఓఆర్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.ఎం.సంతోష్, సెక్రెటరీ ఎం.రాంకిషన్, చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్లు బాలకృష్ణ, జి.నరేంద్ర, శివశరణప్ప, డిఎఫ్వో ప్రకాశ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాపు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.