మార్పు కనిపించేలా చేయండి: మంత్రి కేటీఆర్

by Shyam |
మార్పు కనిపించేలా చేయండి: మంత్రి కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. వివరాల్లోకి వెళితే.. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మునిసిపాలిటీల అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, స్మశానవాటికలపై పూర్తి శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed