సాఫ్ట్‌వేర్ శార‌ద‌ యూటీడీ ఉత్తీర్ణ‌త !

by Shyam |
సాఫ్ట్‌వేర్ శార‌ద‌ యూటీడీ ఉత్తీర్ణ‌త !
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఐటీ ఉద్యోగులు, యువ‌త , విద్యార్థుల‌కు అందిస్తున్న సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌‌శంసించారు. ఆక‌ర్ష‌ణీయ‌మైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఆక‌స్మికంగా పోయిన‌ప్ప‌టికీ, రెట్టించిన ఉత్సాహంతో త‌న కుటుంబం నిర్వ‌హిస్తున్న కూర‌గాయ‌ల వ్యాపారంలో భాగ‌స్వామ్యం పంచుకుంటూ వార్త‌ల్లో నిలిచిన శార‌ద‌కు అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానానికి సంబంధించిన అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణను ఖ‌ర్చులేకుండా అందించ‌డం ప‌ట్ల‌ టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల‌ను ప్ర‌శం‌సించారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డెల్లాస్ ప్ర‌తిష్టాత్మ‌క శిక్ష‌ణ‌లో ఉత్తీర్ణులైన ప‌త్రాన్ని ఆదివారం మంత్రి కేటీఆర్ సాప్ట్‌వేర్‌ శార‌ద‌కు అందించారు.

సాఫ్ట్‌వేర్‌ శార‌ద కోవిడ్ స‌మ‌యంలో అనూహ్యంగా కొలువును కోల్పోవ‌డం, ఉద్యోగం పోయిన‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులతో క‌లిసి కూర‌గాయ‌ల వ్యాపారంలో పాలు పంచుకోవ‌డంతో వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇదేక్రమంలో టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమ‌ర్ మ‌క్తాల‌ ఆమెను సంప్రదించి.. చేసిన ఉద్యోగం, క‌లిగి ఉన్న నైపుణ్యాలపై తెలుసుకొని ఆర్థిక సాయం కంటే, నైపుణ్యాలు అందించి కొత్త ఉద్యోగం సాధించేందుకు స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు టీటా త‌ర‌ఫున కృత్రిమ మేధ‌స్సులో ఉచితంగా శిక్ష‌ణ అందించ‌నున్నట్లు సందీప్ మ‌క్తాల ప్ర‌క‌టించిన అనంత‌రం ప్ర‌పంచ‌ ప్ర‌‌ఖ్యాత యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్స‌స్ ఎట్ డ‌ల్ల‌స్ ద్వారా అందించే శిక్ష‌ణ అనుమ‌తి ప‌త్రం ఇచ్చారు.

Advertisement

Next Story