- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దత్తత నియోజకవర్గంపై కేటీఆర్ చిన్నచూపు
దిశ ప్రతినిధి, రంగారెడ్డి, కొడంగల్: కొడంగల్ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఓ ప్రత్యేకత ఉం ది. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ చేరాడు. ఎమ్మెల్యే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రజ లకు అనేక హామీలు ఇచ్చింది. టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కానీ, ఇప్పటి వరకు నియోజకవర్గంలో పర్యటించిన దాఖలా లు లేవు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కనీ సం ఒక్క అభివృద్ధి పనికైనా శంకుస్థాపన చేసిన పాపన పోలేదని నియోజకవర్గ ప్రజలు, ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల ప్రగతి భవనలో కొడంగల్ మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్సమావేశమై అభివృద్ధి కార్యచరణ రూపొందించాలని సూచించారు. ఆ కార్యచరణ ఏ మైంద ని పట్టణ ప్రజలు నిలదీస్తున్నారు.
ఏడాదిన్నరగా..
వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పట్టణంలో ఏ ఇద్దరు కలిసినా కేటీఆర్ ఇచ్చిన హామీలపై సెటైర్లు వేసుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే సిరిసిల్లతో సమానంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మాట చెప్పి సరిగ్గా ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో కేటీఆర్ పర్యటించింది లేదు. రూ.50 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామనని చెప్పి రూ.4 కోట్లతో డిగ్రీ కాలేజీ, రూ.5 కోట్లతో గురుకుల పాఠశాలను నిర్మిస్తున్నారు. ఈ పనులపైనే సమీక్ష పెట్టి కేటీ ఆర్ అభివృద్ధి చేస్తున్నాని చెప్పుకోవడం సిగ్గు చేటని ప్రతిపక్షాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ దత్తత నియోజకవర్గం కొడంగల్ ను అభివృద్ధి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎత్తిపోతలు ఎటుపాయే?
కొడంగల్రైతుల నీటిగోస తీరుస్తానని అన్ని వర్గాల ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెట్టాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభం కాలేదని, కనీసం భూ సేకరణ, సర్వే కూడా చేయలేదని స్ధానికులు వివరిస్తున్నారు. అన్ని రకాలుగా కొడంగల్ ప్రజలను కేటీఆర్ మోసం చేశారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటు కోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మాటలు ఉత్తవే : బూస చంద్రయ్య, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు
కొడంగల్ నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీలు గుప్పించారు. ఆ హామీలతో ఎమ్మెల్యేను గెలిపించారు.ల కానీ అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసింది లేదు. మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయి. డ్రైనేజీ, వాటర్, బస్టాండ్లో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎమ్మెల్యే పట్టించుకోడు: మెగావత్ శంకర్ నాయక్, కౌన్సిలర్
సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని ఆనాడు కేటీఆర్ ముచ్చట చెప్పిండు. ఇప్పటి వరకు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చింది లేదు. ప్రజా సమస్యలను పట్టించుకుంది లేదు. స్థానిక ఎమ్మెల్యే చిన్నాచితుక పనులతో కాలయాపన చేస్తున్నాడు. అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయిస్తామని ఆ ఊసే ఎత్తడం లేదు. మున్సిపాలిటీలో ప్రతిపక్ష పార్టీలంటే అధికార పార్టీకి గౌరవం లేదు. టీఆర్ఎస్ నియంత పాలన సాగిస్తుంది.