- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నగరంలో ఘనంగా జరిగాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేయడం, మొక్కలు నాటడం, పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ, రక్త దాన శిబిరాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
నాంపల్లి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తన పనితీరుతో కేటీఆర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మెగా రక్తదాన శిబిరాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్, మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.