కంగన సినిమాను కుక్క కూడా చూడదు.. షాకింగ్ కామెంట్స్

by Shyam |
KRK-And-kangana-Ranuat
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కేఆర్‌కే (కమాల్ రషీద్ ఖాన్) కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. ఇన్నాళ్లు ‘రాధే : ది మోస్ట్ వాంటెడ్ భాయ్’ మూవీ విషయంలో సల్మాన్ ఖాన్‌పై కామెంట్స్ చేసిన కేఆర్‌కే.. తాజాగా కంగనా రనౌత్‌ను టార్గెట్ చేశాడు. ఈ మధ్య ఇందిరాగాంధీ పీరియడ్‌ బేస్ చేసుకుని ‘ఎమర్జెన్సీ’ సినిమా ప్రకటించిన కంగన.. తనే డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. తను తప్పా ఈ చిత్రానికి మరెవరూ న్యాయం చేయలేరని అందుకే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

కాగా దీనిపై తాజాగా కామెంట్స్ చేశాడు కేఆర్‌కే. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచిపోతుందని విమర్శించాడు. గతంలో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా వచ్చిన ‘ఇందూ సర్కార్’ ఫ్లాప్ అయిందని, కనీసం కుక్క కూడా ఆ సినిమాను చూడటానికి వెళ్లలేదన్నాడు. ఇప్పుడు కంగన సేమ్ సబ్జెక్ట్ మీద మూవీ చేస్తుందని.. అంటే 12వ ఫ్లాప్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందన్నాడు. ఇప్పటికే కంగన చివరి 11 సినిమాలు సూపర్ ఫ్లాప్‌ అని అభిప్రాయపడ్డాడు కేఆర్‌కే.

Advertisement

Next Story