- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శరీరంతో కాదు ఆత్మతో కనెక్ట్ అయ్యా.. అందుకే మరవలేకపోతున్నా!
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. లేట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి యూనిక్ పోస్ట్ పెట్టింది. జూన్ 14న సుశాంత్ డెత్ యానివర్సీ ఉండగా, తన లైఫ్‌లో సుష్ ఎంతో స్పెషల్ అని.. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాబ్తా’ సినిమా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వీడియో మాంటేజ్ షేర్ చేసింది. ‘ శరీరాలు మాత్రమే కనెక్ట్ అయినప్పుడు అవి వాడిపోతాయి, చనిపోతాయి. కానీ ఆత్మలు కనెక్ట్ అయితే.. శాశ్వతంగా అనుసంధానించబడి ఉంటాయి’ అని క్యాప్షన్ యాడ్ చేసింది. మనం ఎవరితో వర్క్ చేయాలి, ఏ వ్యక్తులను కలవాలి అనేది ముందుగానే డిసైడ్ చేయబడుతుందనే విషయాన్ని విశ్వసిస్తున్నానని తెలిపింది. తన రాబ్తా(బంధం ) సుశాంత్, డినో అండ్ మాడాక్ ఫిల్మ్‌తో ముందుగానే రాసిపెట్టి ఉన్నట్లు భావిస్తున్నానని.. సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ప్రతి చిత్రంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో పెంచుకునే బంధాలు, ఒకరితో ఒకరు జీవించే క్షణాలు జీవితాంతం ఉండిపోతాయన్న కృతి.. ఇతర సినిమాలకు భిన్నంగా ‘రాబ్తా’ తన లైఫ్‌లో ఉత్తమమైనదని, ఎల్లప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటుందని వెల్లడించింది. ‘సుశాంత్ ఇదే మన మొదటి, చివరి సినిమా అవుతుందని నాకు తెలియదు’ అని ఎమోషనల్ అయింది. అయితే ‘రాబ్తా’ సినిమా షూటింగ్ సమయంలో కృతి, సుశాంత్ డేటింగ్‌లో ఉన్నారనే రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.