టాకీస్‌లోనే రవితేజ ‘క్రాక్’

by Anukaran |   ( Updated:2020-08-14 01:34:00.0  )
టాకీస్‌లోనే రవితేజ ‘క్రాక్’
X

మాస్ మహారాజ రవితేజ, గోపి‌చంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘క్రాక్’. డాన్ శీను, బలుపు చిత్రాల ద్వారా హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి సూపర్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతోంది. పది రోజుల షూటింగ్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతుందని లాక్ డౌన్ సమయంలో న్యూస్ వచ్చింది. కానీ, సినిమా థియేటర్‌లోనే రిలీజ్ చేస్తామని నిర్మాత ఠాగూర్ మధు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తకు తెరపడినా..మళ్లీ సరికొత్తగా అదే న్యూస్ హల్‌చల్ చేస్తోంది.

శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుందని మళ్లీ న్యూస్ స్ప్రెడ్ అయింది. దీంతో ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. థియేటర్స్‌లోనే క్రాక్ రిలీజ్ అంటూ సినిమాలో రవితేజ లుక్ షేర్ చేశాడు. రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో శృతి ఓ బిడ్డకు తల్లిగా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు.

https://twitter.com/megopichand/status/1294127819132252164?s=19

Advertisement

Next Story