- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కౌశిక్ రెడ్డి ఓ ‘కుక్క’.. కేసీఆర్ ఎంగిలి బొక్కలకు ఆశపడి’
దిశ, నిజామాబాద్ సిటీ : అసందర్భంగా పిచ్చి ప్రేలాపణలు మానుకోకపోతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి కి గుణపాఠం చెబుతామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు లతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి ఓ కుక్క అని.. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ టికెట్ కోసం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఉండి, ఇప్పుడు కేసీఆర్ ఎంగిలి బొక్కలకు ఆశపడ్డారని విమర్శలు గుప్పించారు.
ఈ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ లపై చేసిన అసత్య ఆరోపణలను నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇటువంటి మాటలు మానుకోకపోతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి కి తగిన బుద్ది చెబుతారని మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుడు గంగాధర్ మాట్లాడుతూ ఈనెల 16న జరిగే ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యగా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసే అవకాశం ఉందని కావున కాంగ్రెస్ శ్రేణులు వీలైనంత తొందరగా హైదరాబాద్ చేరుకోవాలని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున వీలైనంత ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొని నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ కృష్టికి, అభివృద్ధికి దోహదపడాలని ఆయన అన్నారు. సోమవారం నిరసనను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.