- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ సాయంలో కోత..!
దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ప్రజలకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయోననే అనుమానాలు ప్రైవేటు ఉద్యోగుల్లో పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ పనులు దొరికే అవకాశం కన్పించడం లేదు. పేదల, సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా ప్రజల ఇబ్బందులను తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యంతో పాటు నిత్యావసరాల కొనుగోలుకు కొంత డబ్బును సాయంగా అందజేస్తున్నాయి. అయితే, కొద్దిమంది బ్యాంకు ఖాతాల్లో ‘మినిమం బ్యాలెన్స్’ మెయింటెయిన్ చేయలేదనే కారణంతో బ్యాంకులు అందులోంచి కొంత డబ్బును కత్తిరిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవింగ్ అకౌంట్‌లకు జీరో బ్యాలెన్స్ సౌకర్యం ఉంది. కానీ ప్రయివేటు బ్యాంకుల్లో మాత్రం కనీసంగా రూ.10 వేలను ఎప్పటికీ నిల్వ ఉంచాలనే నిబంధనలున్నాయి. ఇప్పుడు ఈ నిబంధనలే పేదల డిపాజిట్లకు భారంగా మారింది. ప్రభుత్వం రూ. 1500 వేసిందన్నసంతోషం ఎంతోసేపు నిలవడంలేదు.
గతంలో కొన్ని తాత్కాలిక అవసరాలకు ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలను దీర్ఘకాలంగా వాడకుండా ఉంచేయడంతో ‘డీఫంక్ట్’ పేరుతో అవి బ్లాక్ అయిపోవడంతో కొద్దిమంది పేదలు వాటిని తీసుకోలేకపోతున్నారు. దాన్ని తిరిగి యాక్టివేట్ చేయించుకోడానికి ‘కేవైసీ’ లాంటి పనులను స్వయంగా బ్యాంకుకు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తోంది. కానీ రోడ్లమీద పోలీసుల ఆంక్షలు, స్వంత వాహనాలు లేకపోవడం, సిటీ బస్సులు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు.
ముషీరాబాద్ నియోజవర్గానికి చెందిన ప్రగతి నాలుగేండ్ల క్రితం పంజాగుట్టలోని ఓ ప్రయివేటు సంస్థలో పని చేసింది. ఆ సమయంలో కొటక్ మహింద్రా బ్యాంకు ప్రతినిధులు స్టాఫ్ అందరికీ శాలరీ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత వారి శాలరీ సదరు అకౌంట్‌లో జమకాలేదు. దీంతో ఆ ప్రయివేటు బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న విషయాన్నే మర్చిపోయింది. ఇప్పుడామె మరో సంస్థలో పనిచేస్తోంది. అక్కడ మరో బ్యాంక్ అకౌంట్ తీశారు. శాలరీ క్రమంగా జమ అవుతోంది. విపత్తుల చట్టం అమలు నేపథ్యంలో జన్ ధన్ ఖాతా లేనందున కేంద్ర నుంచి సాయం అందలేదు. రాష్ట్రం అందించిన సాయాన్నిరెగ్యులర్ అకౌంట్‌లో కాకుండా, నాలుగేండ్ల క్రితం ఓపెన్ చేసి వదిలేసిన ప్రయివేటు బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ప్రభుత్వ సాయాన్ని ఆ బ్యాంకు సిబ్బంది ద్వారా ఆరా తీయగా, అకౌంట్‌లో ‘మినిమం బ్యాలెన్స్’ లేనందున పెనాల్టీ కింద రూ.435లు కట్ అయినట్టు చెప్పారు. దీంతో సదరు లబ్దిదారురాలు ప్రభుత్వం సాయంచేసినదాంట్లో కూడా డబ్బును లాక్కోవడం ఏంటని నెత్తి నోరు బాదుకుంటోంది. రాష్ట్రంలోని 74 లక్షల లబ్దిదారుల్లో ఈ తరహా బాధితులు ఎంతో మంది ఉండొచ్చు.
tags: Corona Effect, Epidemic Act Help, Kotak Mahindra Bank, CM KCR, KTR