- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోమ్‌లోన్ కస్టమర్లకు కోటక్ బ్యాంక్ గుడ్‌న్యూస్..
దిశ, వెబ్‌డెస్క్: కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాల వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఆఫర్ల కంటే అత్యల్పమని పేర్కొంది. వడ్డీ రేటు తగ్గింపు పరిమిత కాలమని, ఈ నెల 31 వరకు వినియోగదారులు 6.65 శాతానికే గృహ రుణాలను పొందే అవకాశం ఉంటుందని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ తన గృహ రుణాల రేట్లను 6.70 శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించిన తర్వాత కోటక్ బ్యాంక్ తన ప్రకటనను విడుదల చేసింది.
రుణాలకు డిమాండ్ తక్కువ ఉన్న నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే గృహ రుణ రేట్లు 15 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజా వడ్డీ రేట్లు, రుణాలను తీసుకునే వినియోగదారుల క్రెడిట్ స్కోరు, లోన్-టూ-వాల్యూ నిష్పత్తికి ముడిపడి ఉంటాయని కోటక్ బ్యాంక్ పేర్కొంది. ‘తక్కువ గృహ రుణ వడ్డీతో వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు బోనస్‌ను అందించడం సంతోషంగా ఉందని’ కోటక్ బ్యాంక్ వినియోగదారు ఆస్తుల విభాగం ప్రెసిడెంట్ అంబుజ్ చంద్నా చెప్పారు.