- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలయ్య నిజస్వరూపం బయటపెట్టిన కోటా.. నమస్కారం పెడితే ముఖంపై ఉమ్మేసి..
దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోపం వస్తే తప్ప.. మిగతా అన్ని విషయాల్లోనూ ఆయన మనసు వెన్న అని అందరికి తెలిసిన విషయమే. అయితే అదే విధంగా ఆయన మాటలు, చేతలు కొన్నిసార్లు దురుసుగా ఉంటాయని ఎన్నోసార్లు రుజువయ్యింది. అది బాలయ్య చిన్నతనం నుంచి వచ్చిన అలవాటే అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే పలుమార్లు అభిమానుల మీద, సినీ, రాజకీయ ప్రముఖుల మీద ఆయన చాలాసార్లు నోరు పారేసుకున్నారు, మరికొన్ని సార్లు చెయ్యి కూడా చేసుకున్నారు. ఇక ఇవన్నీ ఆయన కోపంతో చేసినవే అని అభిమానులు సరిపెట్టుకుంటున్నారు. ఇక చాలామంది నటీనటులు బాలయ్య సెట్ లో ఎలా ఉంటారో చెప్పి ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటారు. తాజాగా బాలయ్య గురించి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఇటీవల కోటా శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో బాలకృష్ణకు తాను నమస్కారం చేస్తే.. ఆయన ముఖంపై ఉమ్మివేసి వెళ్లిపోయాడంటూ ఆ సంఘటనను గుర్తుచేసుకున్నారు. అయితే అది బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమతో అలా చేసి ఉండొచ్చని సర్ది కూడా చెప్పారు. ఇంతకీ అంతలా బాలయ్యకు కోపం తెప్పించే పని కోటా ఏం చేశారంటే.. ఎన్టీఆర్ రాజకీయాలలో తలమునకలై ఉన్నప్పుడు ఆయన తీరును ఎండగడుతూ కోటా శ్రీనివారావు ప్రధాన పాత్రలో ‘మండలాదీశుడు’ అనే ఒక సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో రామారావు పాత్రలో కోటా కనిపించాడు. అయితే ఈ సినిమాలో నందమూరి తారక రామారావును కించపరిచే విధంగా కోటా పాత్ర ఉండటంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటా బయట కనిపిస్తే చాలు చెప్పులు, కర్రలతో కొట్టడానికి వచ్చేవారు. ఇక ఆ సమయంలో తన తప్పు తెలుసుకొని ఎన్టీఆర్ కు సారీ చెప్పడానికి కోటా పార్టీ ఆఫీస్ కి వెళ్లారట. లిఫ్ట్ లో బాలయ్య వస్తూ ఉండగా , కోట శ్రీనివాసరావు చూసి నమస్కారం పెట్టాడట. తన తండ్రి పాత్రలో, తన తండ్రిని చులకన చేసే విధంగా నటించడంతో కోపంతో ఊగిపోయిన బాలయ్య, వెంటనే గాండ్రించి కోట శ్రీనివాసరావు ముఖంపై ఉమ్మినట్లు కోట శ్రీనివాసరావు తెలిపారు. అయితే అది కేవలం తన తండ్రిపై ఆయన చూపిన ప్రేమే అని చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయాలు చాలా తన జీవితంలో జరిగినట్లు తెలిపిన కోటా అవన్నీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చి నిలబడినట్లు తెలిపారు.