Naga Chaitanya: బాహుబలి మేకర్స్‌తో చైతు భారీ బడ్జెట్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

by Hamsa |   ( Updated:2024-12-29 16:16:35.0  )
Naga Chaitanya: బాహుబలి మేకర్స్‌తో చైతు భారీ బడ్జెట్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ‘తండేల్’(Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చందు మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Aravind) నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా.. ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘తండేల్’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచాయి. మరీ ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో.. తాజాగా, నాగచైతన్య మరో భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాను బాహుబలి మూవీ మేకర్స్ ఆర్కా మీడియా(Arka Media Works ) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇది హారర్ కామెడీ జోనర్‌లో రాబోతున్నట్లు టాక్. ఏకంగా రూ. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ(Karthik Verma) దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

Read More...

‘లైలా’ మూవీ నుంచి ‘సోను మోడ‌ల్’ సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన విశ్వక్ సేన్..(వీడియో)


Advertisement

Next Story